SBI Prelims: ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల! 4 d ago

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) క్లరికల్ కేడర్ ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలను ఎస్‌బీఐ ఫిబ్రవరి 22, 27, 28, మార్చి 1వ తేదీన నిర్వహించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 342, అమరావతి సర్కిల్‌లో 50 ఖాళీలున్నాయి. మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 10, 12 తేదీల్లో జరగనున్నాయి. ఎస్‌బీఐ అడ్మిట్ కార్డులను అదే నెల 2వ తేదీ నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.